విజయవాడ పశ్చిమ, పిబ్రవరి 26 (మేటి అమరావతి) ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూతన కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ ఎరైవల్ బ్లాక్ (బస్ స్టాండ్) 4వ ఫ్లోర్ లో శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథి గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరయ్యారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య ను, డైరెక్టర్ లను ఎంపీ శివనాథ్ అభినందించారు.