top of page

ఘ‌నంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూత‌న కార్యాలయం ప్రారంభోత్స‌వం.

  • Writer: metiamaraavathi
    metiamaraavathi
  • 1 day ago
  • 2 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ పశ్చిమ, పిబ్రవరి 26 (మేటి అమరావతి) ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూతన కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ ఎరైవల్ బ్లాక్ (బస్ స్టాండ్) 4వ ఫ్లోర్ లో శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథి గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరయ్యారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య ను, డైరెక్టర్ లను ఎంపీ శివనాథ్ అభినందించారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చైర్మన్ బాలకోటయ్య కు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందిస్తూ సత్కరించారు. అనంత‌రం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ... నిస్వార్థ పరుడైన ప్రజా సేవకుడు పోతుల బాల కోటయ్య .ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వ‌హించ‌టం ఎంతో సంతోషంగా వుంద‌న్నారు.. నిరంతరం ప్రజా సేవకుడిగా ఏ పదవీ ఆశించకుండా ప‌నిచేసిన‌ పోతుల బాలకోటయ్య కు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవి రావడం...ఆ పదవికే వన్నె చేకూరి నట్లుగా భావిస్తున్నన్నారు. నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దగ్గర సైతం బాలకోటయ్య చేసిన మహత్తర ప్రతిపాదన చర్చకు వచ్చిందన్నారు. బాలకోటయ్య చెప్పిన విధంగా అన్ని సంక్షేమ హాస్టల్స్ కు భారత రాజ్యంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ నివాసం పేరు రాజగృహ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారన్నారు. డాక్ట‌ర్. బి ఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం పాటుప‌డే వ్యక్తులంగా పోతుల బాలకోటయ్య ఇచ్చిన సూచనలను అమలు చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ శివనాథ్ తెలిపారు. చైర్మన్ పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ....ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా శాఖ అభ్యున్నతికి పాటుబడతా అన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నాపై ఉంచిన నమ్మకానికి అణుగుణంగా పనిచేస్తా...అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్ ల స్థితిగతులు బాగోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరంగా నివేదిక ఇవ్వడం జరిగిందని, వసతి గృహాలకు రాజగృహ పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఉపాధ్యక్షుడు రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు గూడపాటి పద్మ శేఖర్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు జీవీ నరసింహారావు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter(సంపాదకీయం)

  • White Facebook Icon

© 2026 All Rights Reserved to Meti Amaraavathi by Anand R Vemula.

bottom of page