top of page

విజయవాడలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

  • Writer: metiamaraavathi
    metiamaraavathi
  • 20 hours ago
  • 1 min read

నగరంలో 4000 కేజీల ప్లాస్టిక్ సీజ్ చేసిన ప్రజారోగ్య సిబ్బంది..

విజయవాడ ఫిబ్రవరి 27 (మేటి అమరావతి) విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, నగర పరిధిలో గల అన్ని డివిజన్లో విస్తృతంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై డ్రైవ్ నిర్వహించి 4000 కేజీ ప్లాస్టిక్ ని సీజ్ చేశారని, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు తెలిపారు.

ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు మాట్లాడుతూ నగర పరిధిలో ఉన్న అన్ని షాపుల్లో శానిటరీ సూపర్వైజర్, ఇన్స్పెక్టర్, సెక్రెటరీలతో శుక్రవారం ఉదయం పలు షాపులను తనిఖీ చేసి రైడ్ నిర్వహించి 4000 వేల కేజీల సింగిల్ న్యూస్ ప్లాస్టిక్ను సీజ్ చేసి, 3 లక్షల రూపాయల జరిమానా విధించారని తెలిపారు. అందులో అత్యధికంగా 37వ డివిజన్లో వారికి 120 మైక్రాల కన్నా మందము తక్కువ గల క్యారీ బ్యాగులు వాడుతున్నందుకు సుమారు 250 కేజీ కవర్లు సీజ్ చేసి Rs. 1,80,000/- రూపాయలు జరిమాన విధించారని తెలిపారు.

పర్యావరణహితమైన వస్తువులే వాడాలని, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజలకు, వినియోగదారులకు, అమ్మేవారికి, ప్రజారోగ్యం సిబ్బంది అవగాహన కల్పించారు. 120 మైక్రోన్ల కంటే తక్కువగా ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవకుండా పర్యావరణానికి హాని కల్పించేవని వారికి చెప్పి, కేవలం పర్యావరణహితమైన గుడ్డ సంచులు, జ్యూట్ బాగులు, పేపర్ కవర్లు, వాడాలని వాళ్లకి అవగాహన కల్పించారు.

Comments


Subscribe to Our Newsletter(సంపాదకీయం)

  • White Facebook Icon

© 2026 All Rights Reserved to Meti Amaraavathi by Anand R Vemula.

bottom of page