మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.
- metiamaraavathi
- Feb 28
- 1 min read
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.
ఇబ్రహీంపట్నం, (మేటి అమరావతి) ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును ఈ నెల పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, కూటమి నేతలు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. రెడ్డిగూడెం మండలంలో 7,125 మందికి రూ.3,03,84,000లు,
మైలవరం మండలంలోని 9471 మందికి రూ.4,07,96,000లు,
విజయవాడ రూరల్ మండలంలోని 6,957 మందికి రూ.3,02,93,500లు,
జి.కొండూరు మండలంలోని 8,472 మందికి రూ.3,61,65,000లు,
ఇబ్రహీంపట్నం మండలంలోని 4,719 మందికి రూ.2,02,16,500లు,
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,210 మందికి రూ.2,28,52,000లు మంజూరయ్యాయి. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి స్పౌజ్ కేటగిరి కింద మార్చి నెలకు నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





Comments