top of page

శిక్షణా కేంద్రమా..శిక్షలకు కేంద్రమా...

  • Writer: metiamaraavathi
    metiamaraavathi
  • Mar 13
  • 3 min read

ఎపి జెన్ కో శిక్షణా కేంద్రంలో మహా వృక్షాలను నరుకుతున్న ఇంజనీరు...

 ఒక ప్రక్కన బూడిద కాలుష్యంతో పలు రకాల వ్యాదుల భారిన పడుతున్న కొండపల్లి , ఇబ్రహీంపట్నం వాసులు తీవ్ర ఆంధోళన వ్యక్తం చేస్తుంటే ఉన్న కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టకపోగా... కాలుష్యాన్ని ఎంతో కొంత అడ్డుకుని ప్రజలకు ఆక్సీజన్ ను అందించే వృక్షాలను దయా దాక్షిణ్యాలు లేకుండా నేలమట్టం చేస్తున్నారు ఛీఫ్ ఇంజనీరు బొడ్డు శ్రీథర్. మొక్కలు నాటిన చేతులకు పరి పరీ దండాలూ రామా, మట్టిని తాకిన చేతులకు మరీ మరీ దండాలు అంటూ చెట్ట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ కవి పాటును రాసి మరీ పాడాడు. కానీ అదెంటో కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్న డాక్టర్ ఎన్టీటిపిఎస్ ఇంజనీర్లు పెద్ద చెట్లను నరికి పడేస్తున్నారు. రానున్న వేసవిలో బూడిద కాలుష్యంతో పాటు చెట్లను నరకడంతో కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపేందుకు కంకణం కట్టుకున్నారో ఏమో తెలియదు కానీ కనబడిన ప్రతీ చెట్టును నరికేస్తున్నారు బొడ్డు శ్రీథర్ అనే ఇంజనీరు. ఎంత టెక్నాజీని కనిపెట్టినా ఒక్క బియ్యపు గింజను కూడా తయారు చేయలేమనే విషయాన్ని డాక్టర్ ఎన్టీటిపిఎస్ ఇంజనీర్లు ఎప్పుడు గుర్తిస్తారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

టెక్నాలజీ ఉపయోగించి మరీ స్థానికుల ఆరోగ్యానికి, ఉద్యోగుల, కార్మికుల భద్రతను మంటకలుపుతున్న చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ చీపు వ్యవహారాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వోల్టా చట్టాలను, కార్మిక చట్టాలను పెట్రోల్ పోసి తగలబెడుతూ సహచర ఉద్యోగులను కూడా రాచి రంపాన పెడుతున్నారని కార్మికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జెన్కోకు చెందిన ఉద్యోగుల శిక్షణ కేంద్రం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇక్కడ జెన్ కో ఉద్యోగులకు అవసరమయిన శిక్షణ ఇచ్చి రాష్ట్రంలోని వివిధ జెన్ కో విద్యుత్ స్టేషన్లలో ఉద్యోగులుగా నియామకం చేస్తారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన శిక్షణ కేంద్రంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ పరిస్థితి విచిత్రంగా, అత్యంత ప్రమాదకరంగా కనబడుతుందనే చెప్పాలి. బొడ్డు శ్రీథర్ అనే వ్యక్తి జెన్ కో లో చేరిన నాటి నుండి ఇప్పటివరకు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని ఎక్కడా కూడా పట్టుమని పది కాలాల పాటు ఉద్యోగం చేయకుండా నిరంతరం వివాదాలలో ఉండే బొడ్డు శ్రీధర్ వ్యవహారంతో జన్కో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఈ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ వ్యవహారం మరింత ముదిరి పాకాన పడి ఉద్యోగులను, కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా అనేక చర్యలను చేపడుతూ ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కథనంతో పాటు కనిపిస్తున్న ఫోటోలో ఆయన చేస్తున్న చర్యలకు, సహ ఉద్యోగులను కార్మికులను ఆయన ఏ స్థాయిలో వేధిస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వ కార్యాలయ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఒక పెద్ద చెట్లను వృక్షాలను పెంచడం వల్ల చుట్టుపక్కల పర్యావరణం కాపాడబడుతుంది అనేది జగమెరిగిన సత్యం. వీటిపిఎస్ లాంటి అత్యధిక స్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లే పవర్ ప్లాంట్ కి అనుకొని ఉన్న జెన్కో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రయాణంలో గతంలోని అధికారులు పెద్ద ఎత్తున చెట్లను పెంచారు. దానివల్ల వి టి పి ఎస్ కాలుష్యం తీవ్రత తగ్గే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టాలు, వోల్టా యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలు మొదలైనవి అన్ని కూడా పరిశ్రమల ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లను పెంచాలని చెప్తున్నాయి. వోల్టా నిబంధనల ప్రకారం కనీసం ఒక చెట్టును నరకాలంటే స్థానిక రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవడంతోపాటు చెట్లను నరుకుతుంటే ఎన్ని చెట్లున్నాయి. వాటి వివరాలు తెలియజేస్తూ వాటి స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయటం, వాటి రక్షణ చర్యలను చేపట్టడం మొదలైన వాటితో పాటు నరుకుతున్న చెట్లకు సంబంధించి అటవీ శాఖ వారి అంచనాలకు లోబడి రెవెన్యూ కార్యాలయంలో ధరావత్తు చెల్లించడం ద్వారా రెండు మూడు శాఖల నుండి ముందస్తు అనుమతులు పొందాలి. ఆ తర్వాత నరికిన చెట్ల స్థానంలో 1-2 నిష్పత్తి పద్ధతిలో మరిన్ని కొత్త మొక్కలను నాటాల్సి ఉంటుంది. కానీ ఏపీ జెన్కో శిక్షణా కేంద్రం (ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) చీఫ్ ఇంజనీర్ అటువంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ఇది కేవలం నాణానికి ఒకవైపు చట్ట విరుద్ధ విధ్వంసక చర్యలు మాత్రమే. మరోవైపు కార్మికులను సహచర ఉద్యోగులను వారి వ్యక్తిగత భద్రతను పణంగా పెట్టి ఇటువంటి భద్రతా చర్యలను తీసుకోకుండా ఇష్టారాజ్యంగా, అరాచకంగా ఆయన కార్యాలయంలో ఉన్న పెద్దపెద్ద వృక్షాలను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఫైల్ ఫొటోలో కనబడుతున్న విధంగా ఒక పెద్ద వృక్షాన్ని కానీ స్వయంగా మిషన్తో నరకటం, చెట్ల పెద్ద ఎత్తున ఉన్న పెద్ద పెద్ద కొమ్మలను ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉండి తానే స్వయంగా తాడు కట్టి లాగటం, ఎటువంటి భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఒక చీఫ్ ఇంజనీర్ హోదాలో ఉన్న దాని స్వయంగా తన వ్యక్తిగత భద్రతను కూడా పక్కనపెట్టి విచక్షణా రహితంగా నిచ్చెను వేసుకుని చెట్ల పైకి ఎక్కి చెట్లను ఇష్టారాజ్యంగా నరికి వేస్తున్న ఫోటోలు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఇది మాత్రమే కాకుండా తన సహచర అధికారులు ఉద్యోగులు అయిన ఆధిపరి కొంత మందిని కూడా వారి ధైర్యం దిన విధులతో సంబంధంలేని అనేకమంది అధికారులను కూడా రాచి రంపానపెడుతూ ఉద్యోగులతో కూడా వెట్టిచాకిరి చేపిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో ఇప్పటికే కొన్ని టన్నులకొద్దీ వృక్షాలను నేల కూలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనే స్వయంగా పచ్చని చెట్లను రంపనితో కోస్తూ ఉన్న ఫోటోలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఆ తర్వాత నరికిన చెట్లు ఎండిపోయే వరకు ఉంచి,  అక్కడే వాటిని పెట్రోల్ తో తగలబెట్టడం చూస్తే మరింత ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. టన్నుల కొద్ది నరికిన చెట్లు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెనక బాగాన పెద్ద ఎత్తున పోగుచేసి పెట్రోల్ తో స్వయంగా తగలబెడుతున్నట్లు సమాచారం. ఇటువంటి చర్యల వల్ల పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు జరిగితే ఉద్యోగుల భద్రతకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉద్యోగులు తీవ్ర ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. వాపోతున్నారు. కార్మిక చట్టాలను, కార్మికుల ఉద్యోగుల భద్రతను, కేంద్ర ప్రభుత్వ వాల్టా గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలను తుంగలో తొక్కుతున్న ఏపీ జెన్కో శిక్షణా కేంద్రం చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ అరాచక, అడ్డగోలు వ్యవహారాలపై జెన్కో అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి సరైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో ఏపీ జెన్కో శిక్షణా కేంద్రం (ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఉద్యోగులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter(సంపాదకీయం)

  • White Facebook Icon

© 2026 All Rights Reserved to Meti Amaraavathi by Anand R Vemula.

bottom of page