ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను రద్దు చేయండి.
- metiamaraavathi
- Mar 30
- 3 min read
గాంధీ కుట్రతో దళిత హింధువులకు అన్యాయం జరిగింది...
సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ.

దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అసహనం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశు ద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా కుల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ అసహనం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశు ద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, శాస్వతంగా దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, అయితే ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని మంద కృష్ణ అన్నారు. అవి వివక్షతో కూడుకున్నవని, దళితుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే ఆ రద్దు చేయాలని చేశారు.1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఆయన మండిపడ్డారు. కుల వ్యవస్థ వల్ల అత్యంత దారుణంగా నష్టపోయింది దళితులేనని, పశువుల కంటే హీనంగా చూడబడిన దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అసహనం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ది ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, అయితే ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని మంద కృష్ణ విమర్శించారు. అవి వివక్షతో కూడుకున్నవని, దళితుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. కుల వ్యవస్థ వల్ల అత్యంత దారుణంగా నష్టపోయింది దళితులేనని, పశువుల కంటే హీనంగా చూడబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, అందుకే ఎస్సీ హోదా కొనసాగించాలని కోరారు. దేశంలోని కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులేనని మంద కృష్ణ పేర్కొన్నారు. “ఈ వ్యవస్థలో ఏ రెండు కులాల మధ్య సామాజిక సామరస్యం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ, గౌరవం పొందుతున్నది మాత్రం బ్రాహ్మణ వ్యవస్థే" అని ఆయన ఆరోపించారు. అసమానతలను కోరుకునే వారే కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటారని, సమానత్వాన్ని కాంక్షించే వారు కుల నిర్మూలన కోసం పోరాడతారని తెలిపారు. కుల వ్యవస్థ రద్దుపై ఏ రాజకీయ పార్టీకి ఏ విధమైన అభిప్రాయం ఉందో బహిరంగంగా వెల్లడించాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. అంటరానితనం ఏ వ్యవస్థ నుంచి పుట్టిందో పార్టీలు స్పష్టం చేయాలన్నారు. కుల వ్యవస్థను రద్దు చేసేందుకు ఏ పార్టీ లేదా సంస్థ ముందుకు వచ్చినా, ఎమ్మార్పీఎస్ తరఫున వారికి అండగా నిలబడతామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని, దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం మరియు వివక్షతకు ప్రతిరూపమని అన్నారు. కుల వివక్షతను రూపుమాపడం చేతకానప్పుడు కుల వ్యవస్థను రద్దు చేయండంటూ హితవు పలికారు. ఓసి, బిసి క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నించారు. క్రైస్తవాన్ని ప్రచారం చేసే మత ప్రచారకులంతా అగ్రకులాల వారేనని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 25 కు పూర్తి విరుద్ధమని అన్నారు. హిందూ దేవాలయాలలోకి రావద్దు,ఇంకో మతంలోకి వెళ్ళద్దు అని దళితులకు ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని ఆవేధన వ్యక్తం చేశారు. ఏమి తినాలో, ఎలా ఉండాలో ,ఎక్కడికి వెళ్ళాలో, ఏ విశ్వాసాలు పాటించాలో మీరే నిర్ణయిస్తారా..? అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. దళితులు గొర్రెలు అనుకుంటున్నారా ? ఇకపై చెల్లవంటూ హెచ్చరించారు. గాంధీ మరియు గాంధీ అనుచరుల కుట్రల వల్ల దళిత క్రైస్తవులు హక్కులు కోల్పోయారని అన్నారు. గాంధీ కుట్రల వల్ల దళితులు కమ్యునల్ అవార్డును మరియు మత స్వేచ్ఛ హక్కులను కోల్పోయారని తెలిపారు. రాజ్యాంగ సమయంలో క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించింది అగ్రకులాల వారేనని , అందువల్లనే దళిత క్రైస్తవుల హక్కులపై వాళ్ళు మాట్లాడ లేదని అన్నారు. క్రైస్తవంలోకి వెళితే బ్రాహ్మణుల , రెడ్డిల , కమ్మల, వెలమ కులస్తుల సామాజిక హోదా మారనప్పుడు దళితుల ఎస్సీ హోదా ఎందుకు మారుతుంది.? అని సూటిగా ప్రశ్నించారు. క్రైస్తవంలోకి మారిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు క్రైస్తవంలోకి మారిన దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పొందకూడదని ప్రశ్నించారు. క్రైస్తవంలోకి వెళ్ళినంత మాత్రాన దళితుల సామాజిక స్థితిగతులు మారవని డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 1937లోనే స్పష్టం చేశారని తెలిపారు. దళిత క్రైస్తవులు ఆత్మగౌరవానికి ,సామాజిక హక్కులకు దూరం అయ్యారని అంబేద్కర్ ఆవేదన చెందాడని పేర్కొన్నారు. కుల వ్యవస్థ అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. కుల వ్యవస్థ వల్ల దళితులు పశువుల కన్నా హీనంగా చూడబడ్డారని గుర్తు చేశారు. కుల వ్యవస్థ వల్లనే హిందూ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించలేకపోయిందన్నారు. క్రైస్తవం , ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంటే హిందూ మతం ఎందుకు ప్రభావం చుపెట్టలేకపోతుందో ఆలోచించి లోపాలు సరి చేసుకోవాలని సూచించారు. అఖండ భారత్ నుండి ప్రస్తుత భారత్ మిగిలింది, కుల వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రస్తుత భారత్ కూడా మిగలదేమో అని ఆందోళనగా ఉందన్నారు. అందుకే కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలు అందరివి అయినప్పుడు బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అయోధ్య మొదలుకొని అన్ని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పూజారులుగా నియమించాలన్నారు. రాముడికి , శ్రీ కృష్ణుడికి తోడుగా యుద్ధంలో నిలిచింది దళితులు, గిరిజనులు మరియు బీసీలే కానీ బ్రాహ్మణులు కాదు.అందువల్ల ఎస్సీ, ఎస్టీ , బీసీలె దేవాలయాల్లో పూజారులుగా ఉండాలి.1956 లో సిక్కు దళిత క్రైస్తవులకు , 1990 లో బౌద్ధ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించినట్లుగానే దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలన్నారు. దళిత క్రైస్తవులు అంబేద్కర్ , నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేయాలన్నారు. ప్రార్థనలు మాత్రమే కాదు పోరాటం కూడా దళిత క్రైస్తవులు చేయాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులు పోరాటం చేస్తే ఎమ్మార్ పిఎస్ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మేటి అమరావతి ప్రత్యేక ప్రతినిధి..




Comments