ఆదివాసీ జాతి గౌరవం: ఐక్యతే మన బలం. ఎస్టి కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి.
- metiamaraavathi
- 1 day ago
- 1 min read

రంపచోడవరం పిబ్రవరి 28(మేటి అమరావతి) మన ఆదివాసీ బడుగు బహిన వర్గాల నుండి ఒక ఆదివాసీ నాయకుడిగా ఎదుగుతున్నాడంటే, అది ఒక వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాదు — అది మొత్తం జాతి గౌరవం. కానీ ఒక ఆదివాసీ ఎదుగుతున్నప్పుడు మరొక ప్రతి ఆదివాసీ సపోర్ట్‌గా నిలవకపోతే, మన జాతి శక్తి తగ్గిపోతుంది.
ప్రతి ఆదివాసీ జాతి కోసం ఆలోచించాలి. మన జాతి అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి — ఇవన్నీ మన ఐక్యత మీదే ఆధారపడి ఉంటాయి. మనలో మనం విభేదిస్తే, మన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. కానీ మనం ఒక్కటిగా నిలిస్తే, ఏ శక్తి మన ముందుకు అడుగు ఆపలేడు. ఆదివాసీ జాతి కోసం మేలుకోలిపే వారు ఉండాలి. విద్యా రంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో, సామాజిక సేవ రంగంలో — ప్రతి రంగంలో మన ప్రజలు ముందుకు రావాలి.
ఎవరు ఏ రంగంలో ఉన్నా, తమ జాతి శ్రేయస్సు కోసం కొంత సమయం, కొంత సేవ అంకితం చేయాలి.
మన జాతి నిర్మాణం కోసం త్యాగం, సేవ, ఐక్యత చాలా అవసరం. కొంతమంది ముందుకు వచ్చి పని చేస్తారు. కానీ వారి వెనుక నిలబడే వేలమంది అవసరం. నాయకుడు ఒక్కడే సరిపోడు — అతనికి తోడుగా నడిచే జాతి కావాలి.
నేను నా జాతి కోసం నా వంతు ఎంతైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గిరిజనుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తాను.
ప్రతి ఆదివాసీ నా సేవలో భాగస్వామిగా మారి, నాతో కలిసి ముందుకు నడవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన ఐక్యతే మన బలం. మన ఐక్యతే మన భవిష్యత్తు.




Comments