సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాక సందర్భంగా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి.
- metiamaraavathi
- Feb 28
- 1 min read
రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామల రావు.

మచిలీపట్నం, ఫిబ్రవరి 27 (మేటి అమరావతి) వచ్చే మార్చి నెల 1 వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామల రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో ఉపచారిక విశ్రాంతి( సెరిమోనిఎల్ లాంజ్) భవనంలోనీ రిజర్వ్ లాంజ్, సెక్యూరిటీ చెక్, నిర్గమన ప్రదేశాలను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. అనంతరం కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు లతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన ఏర్పాటుపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ వచ్చే మార్చి నెల ఒకటో తేదీన ప్రధాన న్యాయమూర్తి మధ్యాహ్నం తిరుపతి నుండి విమానంలో బయలుదేరి గంటలకు గన్నవరం విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకుంటారన్నారు.. వారు అమరావతి, విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొని అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు మరల గన్నవరం విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ వెళతారన్నారు. ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలను ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి ప్రయాణించే మార్గంలో వాహన శ్రేణి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు నివారించే యంత్ర సామాగ్రి సరిగా పనిచేస్తున్నాయా లేదా ఒకసారి గమనించాలన్నారు. వైద్య సహాయం కోసం అంబులెన్స్, సమీపంలోని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పర్యటనలో విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్ కే. రెడ్డి , టర్మినల్ ఇన్చార్జ్ అంకిత్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం , గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, విమానాశ్రయం సిఎస్ఓ ధర్మేంద్ర, విద్యుత్ శాఖ ఇంజనీర్ సౌజన్య, గన్నవరం తహసిల్దారు శివయ్య, ఎంపీడీవో మాధవిలత తదితర అధికారులు పాల్గొన్నారు.




Comments